సరి కొత్త లుక్ తో షాక్ ఇస్తున్న భాగమతి

సరి కొత్త లుక్ తో షాక్ ఇస్తున్న భాగమతి
x
Highlights

'బాహుబలి' సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి గతేడాది 'భాగమతి' అనే సినిమాతో మరొక బ్లాక్బస్టర్ ను నమోదు చేసుకుంది....

'బాహుబలి' సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి గతేడాది 'భాగమతి' అనే సినిమాతో మరొక బ్లాక్బస్టర్ ను నమోదు చేసుకుంది. 'సైజ్ జీరో' సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క ఎప్పటినుండో బరువు తగ్గడానికి నానా కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంవత్సరం పాటు సినిమాల నుంచి బ్రేక్ కూడా తీసుకుంది అనుష్క. ఈ గ్యాప్ లో రకరకాలు గా బరువు తగ్గడానికి ప్రయత్నించిన అనుష్క ఆస్ట్రియా సైతం వెళ్లి వచ్చింది.

ఈ మధ్యనే రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి వేడుకలో దర్శనమిచ్చిన అనుష్క ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన సరి కొత్త లుక్ తో ఫ్యాన్స్ కు షాక్ ఇస్తోంది ఈ 'మిర్చి' బ్యూటీ. తెలుపు రంగు డ్రెస్సులో కెమెరాకి పోజిచ్చిన అనుష్క సన్నగా ఫిట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటో చూస్తే అనుష్క చాలా సన్న పడిపోయిందని అర్థమవుతుంది. ఇక సినిమాల పరంగా అనుష్క 'సైలెన్స్' అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ మాధవన్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో మార్చి నుండి మొదలవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories