Anushka Shetty Marriage: తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోనున్న అనుష్క..?

Anushka Shetty Marriage: టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందిన నటి అనుష్క శెట్టి.

Venkata Chari
Updated on: 28 April 2021 11:45 PM IST
Anushka Shetty Marriage To Dubai Business Man
X
అనుష్క శెట్టి (ఫొటో ట్విట్టర్)

Anushka Shetty Marriage: టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందిన నటి అనుష్క శెట్టి. ప్రస్తుతం చేతిలో కొన్ని సినిమాలతో బిజీగా ఉంది. అయితే, ఆమె పెళ్లిపై అప్పుడప్పుడు చర్చలు తెరపైకి వస్తుంటాయి. తాజాగా అలాంటి రూమర్సే వైరల్ గా మారాయి.

ఒకప్పుడు ఎక్కువ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉండేది అనుష్క. ఈ మధ్య ఆఫర్లు లేకపోవడంతో ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపోతోంది. ఈ క్రమంలో అనుష్కకు త్వరలో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట. దీనికి స్వీటీ కూడా ఓకే చెప్పిందంట. దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకుతో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే అతడు అనుష్క కంటే వయసులో చిన్నవాడనే టాక్ నడుస్తోంది. ఒకవేళ అంతా కుదిరితే కరోనా పరిస్థితులు సాధారణం స్థితికి వచ్చాక పెళ్లి చేస్తారనేది నెట్టింట్లో తిరుగుతోంది. కాగా ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే అనుష్క చెప్పేవరకు ఆగాల్సిందే.

అయితే, డార్లీంగ్‌ ప్రభాస్‌- అనుష్కల జోడిపై కూడా చాలా రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని పుకార్లు కూడా వచ్చాయి. అయితే దీనిపై ప్రభాస్‌, అనుష్కలు స్పందించి తాము కేవలం స్నేహితులమే అని క్లారిటి ఇచ్చిన విషయం తెలిసిందే.

Venkata Chari

Venkata Chari

Next Story