ఉత్కంఠ రేపుతున్న అనుష్క 'నిశబ్దం' ట్రైలర్!

Nishabdham Trailer : అనుష్క ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'నిశ్శబ్దం'.. కోన ఫిలిం కార్పొరేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై

Krishna
Published on: 21 Sept 2020 1:37 PM IST
ఉత్కంఠ రేపుతున్న అనుష్క నిశబ్దం ట్రైలర్!
X

Anushka Shetty Nishabdham

Nishabdham Trailer : అనుష్క ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'నిశ్శబ్దం'.. కోన ఫిలిం కార్పొరేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో నటించింది.. అనుష్కతో పాటుగా అంజలి, శాలిని పండే, మాధవన్ ఈ చిత్రంలో కీలక పత్రాలు పోషించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకి సిద్దం అయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఆఫీషియల్ గా ప్రకటనని విడుదల చేసింది.

ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని యంగ్ హీరో రానా చేత రిలీజ్ చేయించింది.. ఉత్కంఠ భరితంగా ఉన్న ట్రైలర్ ఆకట్టుకుంటుంది.. సోనాలి అనే యువత కనిపించకుండా పోవటానికి కారణం ఏంటి? సాక్షి(అనుష్క), ఆంటోని(మాధవన్‌)లు ఎవరు? వారికి సోనాలికీ సంబంధం ఏంటి? ఇలాంటి సందేహాలు ప్రేక్షకులను వెంటాడుతున్నాయి.. దీనికి సమాధానం తెలియాలి అంటే నిశబ్దం చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాని తీసుకువస్తున్నారు. ఇక అక్టోబర్ రెండునే రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' సినిమా కూడా రిలీజ్ అవుతుంది.



Krishna

Krishna

Next Story