అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో అనుష్క 'నిశ్శబ్దం'

Anushka Shetty Nishabdham film to release on October 2nd in Amazon Prime Video
Anushka Shetty Nishabdham : కరోనా వలన ధియెటర్లు మూతపడడంతో మేకర్స్ సినిమాలని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్
Anushka Shetty Nishabdham : కరోనా వలన ధియెటర్లు మూతపడడంతో మేకర్స్ సినిమాలని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కీర్తి సురేశ్ 'పెంగ్విన్', సుధీర్‌బాబు, నాని 'v' చిత్రాలు రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. అందులో భాగంగానే అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్దం' మూవీని కూడా ఓటీటీ వేదికగానే రిలీజ్ చేయనున్నారు.. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేసింది. వాస్తవానికి ఏప్రిల్ 2నే 'నిశ్శబ్దం' మూవీ థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో వాయిదా పడింది.
🤫🤫🤫🤫🤫 https://t.co/Imz8HJgU2h
— kona venkat (@konavenkat99) September 18, 2020
అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. అనుష్కతో పాటుగా అంజలి, శాలిని పండే, మాధవన్ ఈ చిత్రంలో కీలక పత్రాలు పోషించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. సినిమా ఎక్కువ భాగాన్ని విదేశాల్లోనే తెరకెక్కించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఇక అక్టోబర్ రెండునే రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' సినిమా కూడా రిలీజ్ అవుతుంది.