Anupam Kher mother tests Positive: అనుపమ్ ఖేర్ తల్లికి కరోనా.. కుటుంబసభ్యులకు కూడా..

Anupam Kher mother tests Positive: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తల్లి దులారి కరోనావైరస్ భారిన పడ్డారు. ఇటీవల ఆమె నమూనాలను సేకరించగా కరోనా పాజిటివ్ అని తేలింది

Raj
By Raj
Published on: 12 July 2020 12:25 PM IST
Anupam Kher mother tests Positive: అనుపమ్ ఖేర్ తల్లికి కరోనా.. కుటుంబసభ్యులకు కూడా..
X
Anupam Kher mother tests positive for coronavirus actor report is negative

Anupam Kher mother tests Positive: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తల్లి దులారి కరోనావైరస్ భారిన పడ్డారు. ఇటీవల ఆమె నమూనాలను సేకరించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్నీ అనుపమ్ ఖేర్ ఒక వీడియోలో వెల్లడించారు.. దీనిని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన తల్లి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఖేర్ సోదరుడు, రాజు ఖేర్, బావ, మేనకోడలు కూడా కరోనావైరస్ భారిన పడ్డారని. అయితే తన నివేదిక మాత్రం నెగటివ్ గా వచ్చినట్టు తెలిపారు.

సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని పంచుకుంటూ ఖేర్ ఇలా పేర్కొన్నారు " నా తల్లి 'దులారి' కోవిడ్ పాజిటివ్ (స్వల్పంగా) ఉన్నట్లు అందరికీ తెలియజేస్తున్నాను. మేము ఆమెను కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్పించాము. నా సోదరుడు, అలాగే భాభి మరియు మేనకోడలుకు కూడా స్వల్పంగా కోవిడ్ సోకింది. నన్ను కూడా పరీక్షించారు. అయితే నా రిపోర్టు నెగటివ్ వచ్చింది' అని పేర్కొన్నారు.

ఇదిలావుంటే శనివారం, అమితాబ్ బచ్చన్ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. తండ్రి, కొడుకులిద్దరు ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముంబైలోని నానావతి ఆస్పత్రిలోని రెస్పి రేటరీ ఐసోలేషన్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్న అమితాబ్‌, అభిషేక్‌ల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు ప్రకటించారు.


Raj

Raj

Next Story