రామ్ సరసన బన్నీ హీరోయిన్

చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోయినా అప్పటికీ వరుసగా ఒకదాని తర్వాత మరొక ఆఫర్ అందుకుంటున్న హీరోయిన్ లలో అను ఇమ్మాన్యూల్ ఒకరు.

Ruthvik
Updated on: 24 Jan 2019 7:34 AM IST
రామ్ సరసన బన్నీ హీరోయిన్
X

చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోయినా అప్పటికీ వరుసగా ఒకదాని తర్వాత మరొక ఆఫర్ అందుకుంటున్న హీరోయిన్ లలో అను ఇమ్మాన్యూల్ ఒకరు. గతేడాది 'అజ్ఞాతవాసి' మరియు 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'శైలజ రెడ్డి అల్లుడు' సినిమా లతో డిజాస్టర్లు అందుకున్నప్పటికీ ప్రస్తుతం అను కి మరొక సినిమాలో ఆఫర్ లభించింది. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం అను ఇమ్మాన్యూల్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

'ఇస్మార్ట్ శంకర్' అనే సరికొత్త టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా హిట్ అవ్వడం అను ఇమ్మాన్యుయేల్ కు మాత్రమే కాక పూరి మరియు రామ్ కెరీర్ లకు కూడా కీలకం. ఈ సినిమా షూటింగ్ జనవరి ఆఖరి వారం నుండి మొదలవనుంది. పూరి కనెక్ట్స్ పై పూరి మరియు చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణి శర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వేసవి లో విడుదల కానుంది.

Ruthvik

Ruthvik

Next Story