Ala Vaikunthapurramuloo : అల..బన్నీ రికార్డులలో.. మళ్ళీ ఇంకోటి!

Ala Vaikunthapurramuloo : అల..బన్నీ రికార్డులలో.. మళ్ళీ ఇంకోటి!
x

Ala Vaikunthapurramuloo

Highlights

Ala Vaikunthapurramuloo : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'.

Ala Vaikunthapurramuloo : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ టేకింగ్ , అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ , పూజా అందాలు, తమన్ సంగీతం ఇలా వేటికవే హైలెట్ గా నిలుస్తూ సినిమాని బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాయి. ఇండస్ట్రీ లోనే అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలచింది ఈ సినిమా..

అయితే ఈ సినిమా విడుదలకి ముందు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయి సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.. ఎక్కడ చూసిన సామజవరగమనా, రాములో రాములా, బుట్టబొమ్మ పాటలు వినిపించాయి.. ఇప్పటికే ఈ పాటలు చాలా రికార్డులను సృష్టించాయి.. అయితే ఇప్పుడు అలాగే మరో ఫస్ట్ ఎవర్ సౌత్ ఇండియన్ రికార్డును ఖాతాలో వేసుకుంది..

సినిమాలోని మాస్ సాంగ్ "రాములో రాముల"లిరికల్ వీడియో 200 మిలియన్ వ్యూస్ తో అప్పుడు రికార్డు సృష్టించగా, తాజాగా ఫుల్ వీడియో సాంగ్ కూడా 200 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది. అంతేకాకుండా 1 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇలా ఒక లిరికల్ సాంగ్, వీడియోకు అదే ఫీట్ అందుకోవడం చాలా అరుదు అని చెప్పాలి. ఇంకా ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే ఓ సినిమాని చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఆర్య, ఆర్య 2 లాంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories