Butta Bomma Song New Record : బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డు!

Butta Bomma Song New Record : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠపురములో' చిత్రం ఎంత పెద్ద హిట్

Krishna
Published on: 2 Aug 2020 11:27 AM IST
Butta Bomma Song New Record : బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డు!
X
Butta Bomma song poster

Butta Bomma Song New Record : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠపురములో' చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలకి ముందు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఆల్బమ్ మొత్తంలో బుట్టబొమ్మ పాటకి అందరూ ఫిదా అయిపోయారు. ఎక్కడ విన్న, చూసిన ఇదే పాట.. ఇక మొన్నటివరకూ టిక్ టాక్ లో ఇదే పాట హాల్ చల్ చేసింది.

ఇప్పటికే పలు రికార్డులను సృష్టించిన ఈ పాట తాజాగా మరో రికార్డును బద్దలు కొట్టింది. ఈ పాట తాజాగా 300 మిలియన్ల క్లబ్‌లో చేరింది. ఇందులో 2 మిలియన్ లైక్స్ ఉండటం మరో విశేషం.. ఈ పాట 300 క్లబ్‌లో చేరడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తూ అఫీషియల్ గా పోస్టర్‌ను విడుదల చేసింది. తమన్ స్వరపరిచిన ఈ ట్యూన్‌కి, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. జానీ మాస్టర్ స్టైలిష్ కొరియోగ్రఫీ చేశారు. బన్నీ స్టెప్పులు, పూజా అందాలు ఈ పాటకి మరింత అందాన్ని తీసుకువచ్చింది.



ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తరవాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.

Krishna

Krishna

Next Story