మళ్లీ సూపర్ స్టార్ తో యువ సంగీత దర్శకుడు

మళ్లీ సూపర్ స్టార్ తో యువ సంగీత దర్శకుడు
x
Highlights

తెలుగు లో 'అజ్ఞాతవాసి' సినిమా తో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయిన అనిరుద్ రవిచందర్ తెలుగులో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయినా తమిళంలో అప్పటికే...

తెలుగు లో 'అజ్ఞాతవాసి' సినిమా తో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయిన అనిరుద్ రవిచందర్ తెలుగులో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయినా తమిళంలో అప్పటికే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా నాని నటిస్తున్న 'జెర్సీ' సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న అనిరుధ్ రవిచందర్ కోలీవుడ్లో బిజీ సంగీత దర్శకులలో ఒకరు. ఈ మధ్యనే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'పేట' సినిమాకు సంగీతాన్ని అందించిన అనిరుధ్ రవిచందర్ కు ఇప్పుడు మళ్లీ మరొక పెద్ద ఆఫర్ లభించింది. తాజా సమాచారం ప్రకారం అనిరుధ్ రవిచందర్ మళ్లీ రజినీకాంత్ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు

రజినీకాంత్ ఇప్పుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిరుధ్ రవిచందర్ రజిని - ఎ.ఆర్.మురుగదాస్ సినిమాకు సంగీతాన్ని తానే అందిస్తున్నట్లు తెలిపారు. అనిరుద్ ఇంతకుముందు మురుగదాస్ దర్శకత్వం వహించిన 'కత్తి' సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో హీరోగా విజయ్ నటించాడు. 'కత్తి' మరియు 'పేట' సినిమాలలో అనిరుధ్ అందించిన సంగీతం హైలైట్ గా మారిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకు కూడా అలాంటి సంగీతాన్ని అందిస్తారు అని ఫాన్స్ అందరు ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories