మళ్ళీ నాని తో పని చేయనున్న కోలీవుడ్ సెన్సేషన్

మళ్ళీ నాని తో పని చేయనున్న కోలీవుడ్ సెన్సేషన్
x
Highlights

చిన్న వయసులోనే కోలీవుడ్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు అనిరుధ్ రవిచందర్. అక్కడ వరుసగా విజయాలను చవిచూసినా అనిరుద్ 'అజ్ఞాతవాసి' సినిమాతో...

చిన్న వయసులోనే కోలీవుడ్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు అనిరుధ్ రవిచందర్. అక్కడ వరుసగా విజయాలను చవిచూసినా అనిరుద్ 'అజ్ఞాతవాసి' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవడంతో తెలుగులో అతనికి ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ నాని 'జెర్సీ' సినిమా ద్వారా అనిరుద్ కు మళ్లీ అవకాశాన్ని అందించాడు. నాని క్రికెటర్ పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.

'జెర్సీ' చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది విడుదలకు సిద్దం అవుతుంది. ఇప్పటికే అన్ని పాటలు కూడా పూర్తి అయ్యాయట. ఈ సినిమా కు అనిరుధ్ అందించిన పాటలు నానికి బీభత్సంగా నచ్చేయడంతో తన తదుపరి సినిమాకి కూడా అనిరుద్ రవిచంద్రన్ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మరి నానితో కలిసి పని చేసిన ఈ రెండు సినిమాలతో అనిరుధ్ రవిచందర్ మంచి పేరు తెచ్చుకుంటే తెలుగులో కూడా ఇతనికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories