లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయలనుకుంటున్న స్టార్ డైరెక్టర్

Anil Ravipudi
x
Anil Ravipudi
Highlights

వరుసగా నాలుగు హిట్లు అందుకొని అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. స్టార్ ప్రొడ్యూసర్ నుండి స్టార్ హీరోల వరకు ఇప్పుడు అనిల్ రావిపూడి తో సినిమా చేయాలని అందరూ ఎదురు చూస్తున్నారు.

వరుసగా నాలుగు హిట్లు అందుకొని అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. స్టార్ ప్రొడ్యూసర్ నుండి స్టార్ హీరోల వరకు ఇప్పుడు అనిల్ రావిపూడి తో సినిమా చేయాలని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఈ మధ్యనే 'ఎఫ్ 2' సినిమాతో మనల్ని కడుపుబ్బా నవ్వించిన అనిల్ తరువాతి సినిమా ఎలా ఉండబోతోందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అనిల్ ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఎప్పటినుండో అనిల్ దగ్గర ఒక లేడీ ఓరియంటెడ్ కథ ఉందట.

ఇప్పుడు ఆ స్క్రిప్టుని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి అయితే ఇప్పటిదాకా లేడీ ఓరియంటెడ్ అంటే హారర్ సినిమాలు అనుకుంటాం. కానీ ఇది ఒక కమర్షియల్ సినిమా అని తెలుస్తోంది. మామూలు కమర్షియల్ సినిమాల్లో హీరోలను ఎలా చూపిస్తారో హీరోయిన్ ని ఈ సినిమాలో అలా చూపించాలని అనుకుంటున్నాడట. కథ ఎలా ఉండబోతోంది అనేది ఇంకా తెలియదు కానీ మళ్లీ ఒక కొత్త స్క్రిప్ట్ తో సినిమాతో మన ముందుకు వస్తాడని కచ్చితంగా చెప్పొచ్చు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే అనుష్క, నిత్యా మీనన్, సమంత ల పేర్లు గుర్తొస్తాయి. మరి అనిల్ ఎవర్ని ఎంచుకుంటాడో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories