Sreemkuhi Respond on Telugu Bigg Boss 4 Host: బిగ్ బాస్ 4కి ఆయనే హోస్ట్ అంటున్న శ్రీముఖి!

Sreemkuhi Respond on Telugu Bigg Boss 4 Host: బిగ్ బాస్ 4కి ఆయనే హోస్ట్ అంటున్న శ్రీముఖి!
x
Sreemukhi(File Photo)
Highlights

Sreemkuhi Respond on Telugu Bigg Boss 4 Host: అసలు ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ మొదలవుతుందా లేదా అని ఆందోళనలకి లోనవుతున్నా అభిమానులకి 'స్టార్ మా' తన అధికార ప్రకటనతో క్లారిటీ ఇచ్చింది.

Sreemkuhi Respond on Telugu Bigg Boss 4 Host : అసలు ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ మొదలవుతుందా లేదా అని ఆందోళనలకి లోనవుతున్నా అభిమానులకి 'స్టార్ మా' తన అధికార ప్రకటనతో క్లారిటీ ఇచ్చింది. చూస్తుంటే మరో రెండు మూడు వారాల్లో బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదలు కానుంది. అయితే ఈ షోలో కంటిస్టెంట్స్ ఎవరెవరు ఉంటారు. ఈ సీజన్ కి హోస్ట్ ఎవరు చేస్తున్నారు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మిగిలింది.

అయితే ఇంకా బిగ్ బాస్ నుంచి అధికార ప్రకటన రానప్పటికీ ఈ షోలో పాల్గొంటున్న 15 మంది వీరే అంటూ ఓ లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంకా హోస్ట్ వీరే అంటూ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఇప్పటికే విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, సమంత పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అంతే స్థాయిలో గత సీజన్ కి హోస్ట్ గా చేసి షో ని సక్సెస్ చేసిన నాగార్జున పేరు కూడా వినిపిస్తుంది.

ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ అతనే అంటూ బిగ్ బాస్ సీజన్ 3 రన్నరప్ శ్రీముఖి ఆసక్తికరమైన వాఖ్యలు చేసింది. తాజాగా అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొన్న శ్రీముఖి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. " బిగ్ బాస్ నాలుగో సీజన్ 4కి కూడా నాగార్జున గారే హోస్ట్ అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. నేను కూడా అదే బలంగా నమ్ముతున్నాను. సీజన్ 4 హోస్ట్ నాగార్జున గారే అంటూ శ్రీముఖి పేర్కొంది.

కండిషన్స్ అప్లై అంటున్న బిగ్ బాస్ నిర్వాహకులు ;

ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూనే పకడ్భందీగా ఈ షోని నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ రెండు వారాలు ముందుగానే బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలట! అక్కడ వైద్యుల ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులని చెక్ చేస్తారట! ఇష్యూస్ ఏమీ లేకపోతే వారితోనే షోని కంటిన్యూ చేస్తారట నిర్వాహకులు.!

Show Full Article
Print Article
Next Story
More Stories