తల్లా? పెళ్ళామా?? అంటూ అనసూయ హాట్ హంగామా!

K V D Varma
Published on: 26 Feb 2020 6:57 PM IST
తల్లా? పెళ్ళామా?? అంటూ అనసూయ హాట్ హంగామా!
X

యాంకరింగ్ కి గ్లామర్ హంగులు అద్దిన ముద్దుగుమ్మ అనసూయ. జబర్దస్త్ కామెడీ షో లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని యాంకర్లలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. అటు వెండి తెర మీదా రంగామ్మత్తగా మెరిసి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు అనసూయ. బుల్లి తెరమీద ఇటు ఈటీవీ జబర్దస్త్ లో సందడి చేస్తూనే, అటు జీ తెలుగులో లోకల్ గ్యాంగ్ షో కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు అనసూయ. అంతే కాకుండా ప్రతిరోజూ పండగలాంటి షో లలోనూ మెరుస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే, అనసూయ సోషల్ మీడియాలో తన ఫొటోలతో చేసే సందడి మరొకెత్తు. ఆమె ఫేస్ బుక్ ద్వారా హాట్ పిక్స్ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుతూ ఉంటారు. అలాగే తన షో లకు సంబంధించిన విషయాలనూ వారితో షేర్ చేసుకుంటారు.

ఇప్పుడు అనసూయ తాజాగా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా అనసూయ జెమినీ టీవీ కోసం ఒక షో చేయబోతున్నారు. తల్లా? పెళ్ళామా?? పేరుతొ చేయబోతున్న ఆ షో ప్రోమో ఇటీవల విడుదలైంది. ఆ ప్రోమోలో హాట్ డ్రస్ లో చదరంగం ఆడుతూ కనిపించారు అనసూయ. మామూలుగానే హాట్ హాట్ డ్రెస్సింగ్ తో అదరగొట్టే అనసూయ ఈ షో కోసం ఆశ డోస్ మరికొంచెం పెంచినట్టు కనిపించింది. తన టాలెంట్ కి హాట్ నెస్ అద్ధడంలో అనసూయ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. ఇప్పుడు ఈ షో ప్రోమోలో అనసూయని చూసిన వారంతా అమ్మ అనసూయ మరీ ఇంత హాటా అనిపించేలా ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అనసూయ అభిమానులైతే ఈ ప్రోమో చూసి ఎగిరి గంతెస్తున్నారు. మరో హిట్ షో లో అనసూయ కనిపించబోతున్నరంటూ సంబరపడిపోతున్నారు.

మొత్తమ్మీద రంగంమట్ట జెమినీ టీవీలో త్వరలో మగల్లందర్నీ..తల్లా? పెళ్ళామా?? అంటూ ఆదరగొట్ట బోతున్నారు. ఇప్పుడు ఆమె తన అందాలతో ఆదరగోదతారో.. హాట్ డ్రెస్సింగ్ తో ఆదరగోడతారో కొంత కాలం వేచి చూడాల్సిందే!

ఈలోపు ఈ షో ప్రోమో మీరూ చూసేయండి!


K V D Varma

K V D Varma

Next Story