Anasuya Latest Interview : 50 పైసలు ఆదా చేసేందుకు అంత దూరం నడిచిన అనసూయ..

Anasuya Latest Interview : అనసూయ.. పెద్దగా పేరుకి పరిచయం అక్కరలేదు.. న్యూస్ ప్రజెంటర్ నుంచి స్టార్ యాంకర్ గా ఎదిగింది అనసూయ.. ఒకపక్కా
Anasuya Latest Interview : అనసూయ.. పెద్దగా పేరుకి పరిచయం అక్కరలేదు.. న్యూస్ ప్రజెంటర్ నుంచి స్టార్ యాంకర్ గా ఎదిగింది అనసూయ.. ఒకపక్కా బుల్లితెర పైన అలరిస్తూనే మరోపక్కా మంచి పాత్రలు దక్కినప్పుడు వెండితెర పైన కూడా అలరిస్తుంది అనసూయ... క్షణం, సోగ్గాడే చిన్నినాయనా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో కనిపించి అనసూయలో కొత్త కోణాన్ని అందరికి పరిచయం చేసింది.. ఈ సినిమా తరవాత అనసూయకి బాగానే అవకశాలు వచ్చినప్పటికీ ఆచితూచి కథలను ఎంచుకుంటుంది అనసూయ..
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.. తన జీవితంలో పడిన కష్టాలను కూడా ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది అనసూయ.. తనకి అమ్మ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.. తన కోసం, తన సిస్టర్స్ కోసం అమ్మ ఎంతో కష్టపడిందని, చీరలకు ఫాల్స్ కుట్టి మరీ చదివించిందని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనైంది... ఒక్కోసారి ఇల్లు అద్దె కట్టలేకా తక్కువ అద్దె ఉన్న ఇంటికి షిఫ్ట్ అయ్యే వాళ్ళమని వెల్లడించింది. ఇలాంటి చాలా చూశామని భాగోద్వేగానికి లోనైంది.. ఇక ఆర్ధికంగా చాలా కష్టాలు పడుతున్న సమయంలో 50 పైసలు ఆదా చేయడం కోసం ఏకంగా రెండు బస్టాప్‌లు నడిచి బస్సు ఎక్కేదాన్నంటూ వెల్లడించింది అనసూయ..
ఇక అనసూయ జబర్దస్త్ తో పాటుగా పలు షో లతో బిజీ అయిపొయింది. అంతేకాకుండా సినిమాల్లో కూడా నటిస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలో అనసూయకి మంచి పాత్ర దక్కింది. ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుంది. హాస్యనటుడు బ్రహ్మనందం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో కూడా అనసూయ నటిస్తుందని సమాచారం.
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
మెగా హీరోలతో సినిమా ప్లాన్ చేస్తున్న సంతోష్ శ్రీనివాస్
30 Jun 2022 10:00 AM GMTవిషాదం.. ఆర్మీ బేస్ క్యాంప్‌పై విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు...
30 Jun 2022 10:00 AM GMTPost Offices: పోస్టాఫీసులో అకౌంట్ ఉందా.. అయితే మీకు ఈ ప్రయోజనాలు...
30 Jun 2022 9:30 AM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి...
30 Jun 2022 8:39 AM GMT