Anasuya Comments On Sonu Sood : సోనుసూద్ రియల్ హీరో : అనసూయ

Anasuya Comments On Sonu Sood : లాక్ డౌన్ సమయంలో వలసకూలీలను ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో బాలీవుడ్ నటుడు

Krishna
Published on: 13 Aug 2020 11:12 AM IST
Anasuya Comments On Sonu Sood : సోనుసూద్ రియల్ హీరో : అనసూయ
X
sonusood, anasuya (File Photo)

Anasuya Comments On Sonu Sood : లాక్ డౌన్ సమయంలో వలసకూలీలను ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో బాలీవుడ్ నటుడు సోనుసూద్ ఒకరు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు సోనూసూద్‌.. ఇక లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కూలీలు, కార్మికుల‌ను వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు. సినిమాల్లో విలన్ అయినప్పటికీ అంద‌రి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన, విన్నాగాని సోనూసూద్‌ పేరే వినిపిస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ HMTV ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిచింది అనసూయ.. అందులో భాగంగానే నటుడు సోనుసూద్ గురించి స్పందించింది అనసూయ. " సోనుసూద్ చేసిన పనులను నేను చూశాను... అతను చాలా గొప్ప వ్యక్తి.. వలసకూలీలను ఇంటికి చేర్చారు.. రియల్లీ హాట్స్ .. రీసెంట్ గా ఓ రైతు కష్టాన్ని చూసి కూడా అయన చలించిపోయి సహాయం చేశారు. సోనుసూద్ రియల్ హీరో" అని అనసూయ అంది

ఇక అనసూయ జబర్దస్త్ తో పాటుగా పలు షో లతో బిజీ అయిపొయింది. అంతేకాకుండా సినిమాల్లో కూడా నటిస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలో అనసూయకి మంచి పాత్ర దక్కింది. ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుంది. హాస్యనటుడు బ్రహ్మనందం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో కూడా అనసూయ నటిస్తుందని సమాచారం..



Krishna

Krishna

Next Story