"నేను తరుణ్ లవర్ ని కాదు" అని తేల్చి చెప్పిన అనసూయ

Ruthvik
Published on: 31 Jan 2019 3:49 PM IST
నేను తరుణ్ లవర్ ని కాదు అని తేల్చి చెప్పిన అనసూయ
X

ఒకవైపు టీవీ షోలలో యాంకర్ గానే కాక వెండితెరపై నటిగా కూడా తన సత్తా చాటుతూ వస్తోంది అనసూయ. 'క్షణం' సినిమా లో పోలీస్ ఆఫీసర్ గా 'రంగస్థలం' సినిమా లో రంగమ్మత్త గా నటించి తన నటనతో మంచి పేరుతెచ్చుకున్న అనసూయ ఈసారి ఏకంగా హీరోయిన్ గా మారబోతోందని సమాచారం. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 'పెళ్లిచూపులు' సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లోనే సెన్సేషనల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఒకవైపు హీరో గానే కాక కింగ్ అఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ బ్యానర్ ను స్థాపించి ప్రొడ్యూసర్ గా కూడా మారనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం తరుణ్ భాస్కర్ ను హీరోగా పెట్టి విజయ్ దేవరకొండ ఒక సినిమా నిర్మించే ప్రయత్నం లో ఉన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనసూయ ని ఎంచుకున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది అనసూయ. తరుణ్ భాస్కర్ లవర్ గా కాదని తాను నటించట్లేదని చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమాలో తనది ఒక కీలక పాత్ర అని కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం 'కధనం' సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది అనసూయ.

Ruthvik

Ruthvik

Next Story