Anasuya Bharadwaj: అనసూయ ఎమోషనల్‌ పోస్ట్‌.. మనం పర్‌ఫెక్ట్‌ కపుల్‌ కాదని నాకు తెలుసు..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్..పరిచయం అవసరం లేని పేరిది.

Arun Chilukuri
Published on: 5 Jun 2023 3:17 PM IST
Anasuya Bharadwaj Emotional Post on his Marriage Anniversary
X

Anasuya Bharadwaj: అనసూయ ఎమోషనల్‌ పోస్ట్‌.. మనం పర్‌ఫెక్ట్‌ కపుల్‌ కాదని నాకు తెలుసు..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్..పరిచయం అవసరం లేని పేరిది. యాంకర్ గా బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెండితెరకు ప్రమోట్ అయ్యి..రంగమ్మత్తగా ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన పుష్ప మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ అదరగొట్టింది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈరోజు తన పెళ్లిరోజు సందర్భంగా ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. తన భర్త భరద్వాజ్‌ గురించి.. తనతో ప్రేమ, పెళ్లిపై మనసులోని భావాలను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరలవుతోంది.

ప్రేమ, పెళ్లి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది అనసూయ. 2001 సంవత్సరం జనవరి 23వ తేదీన ఓ ఆడిటోరియంలో తన కోసం తన భర్త రాసిన మొదటి ప్రేమలేఖ ఇప్పటికీ గుర్తుందని చెప్పిన అనసూయ.. అప్పుడు నీకు సరైన జవాబు ఇవ్వలేకపోయాను అని పేర్కొంది. అందుకే ఇప్పుడు నీపై నాకున్న ప్రేమను వ్యక్త పరుస్తున్నా. ఇన్నేళ్ల మన జీవితంలో ఎంతోమంది నిన్ను ఎన్నో మాటలు అన్నారు. అయినా వాటిని పట్టించుకోకుండా నాపై ఇంత ప్రేమ చూపుతున్నావు. మన ఇద్దరి మధ్య బంధాన్ని నిలబెడుతున్నావు. మనమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటూ పైకి వస్తున్నాం అంటూ భర్త గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది అనసూయ. అయితే మనం పర్‌ఫెక్ట్‌ కపుల్‌ కాదని నాకు తెలుసు.. ఎంతో పర్ఫెక్ట్ అనేది పక్కనబెడితే కష్ట సుఖాల్లో ఒకరికొకరం తోడుంటున్నాం అని పేర్కొన్న అనసూయ.. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఒక్కటిగా ముందుకు సాగుతున్నాం. నన్ను నన్నుగా నీ జీవితంలోకి స్వాగతించినందుకు థ్యాంక్స్‌ నిక్కు అని తెలిపింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story