Anasuya Bharadwaj: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. కారణం ఏంటంటే?
Anasuya Bharadwaj: నటి అనసూయ భావోద్వేగానికి గురయ్యారు.
Anasuya Bharadwaj: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. కారణం ఏంటంటే?
Anasuya Bharadwaj: నటి అనసూయ భావోద్వేగానికి గురయ్యారు. ఆన్‌లైన్‌లో నెగెటివిటీ వల్ల తాను మానసికంగా ఎంతో ఇబ్బందిపడ్డానంటూ.. ఏడుస్తూ ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరూ కమ్యూనికేట్ కావడం.. ఒకరికొకరు సంతోషాన్ని.. సమాచారాన్ని.. పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలు ఉన్నాయన్నారు అనసూయ. కానీ ప్రస్తుతం సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఎవరూ అందుకు ఉపయోగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా జీవితానికి సంబంధించిన అన్నింటినీ మీతో పంచుకుంటున్నానని తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు తాను కూడా బలహీనతకు గురవుతానని... కన్నీళ్లు పెట్టుకుంటానని పోస్ట్ చేశారు.
కొందరు ఎదుటి వ్యక్తిపై చేసే వ్యాఖ్యలు వాళ్లను తీవ్ర ఇబ్బందిపెట్టొచ్చన్నారు అనసూయ. దయచేసి ఎదుటివారి పట్ల దయతో ఉండాలని కోరారు. ఒక పబ్లిక్ ఫిగర్‌గా.. తనపై ఒత్తిడి ఉంటుందన్నారు. తన బలహీనతను పంచుకోవడం శక్తి అని.. వ్యతిరేకతను అంగీకరించే ధైర్యమే తన బలమని తెలిపారు. సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆ బాధనంతా పొగొట్టుకొని, ఒకట్రెండు రోజుల తర్వాత చిరునవ్వుతో మళ్లీ సవాళ్లను ఎదుర్కోవాలని సూచించారు. దాదాపు ఐదు రోజుల క్రితం తాను బాధను అనుభవించానని,.. ఆ బాధను గుర్తుపెట్టుకోవడం కోసమే వీడియో రికార్డ్ చేశానని పోస్టులో పేర్కొన్నారు అనసూయ.




