Amitabh Bachchan: బిగ్ బీ కి బిగ్ డే

Amitabh Bachchan: అమితాబ్, జ‌యా బ‌చ్చ‌న్ స‌రిగ్గా 48 ఏళ్ల క్రితం ఇదే రోజు (జూన్ 3, 1973) వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు.

Kranthi
Published on: 3 Jun 2021 12:11 PM IST
Amitabh Bachchan Shares Adorable Photos of Their Marriage
X

అమితాబ్ బచ్చన్ (ఫైల్ ఇమేజ్)

Amitabh Bachchan: సూపర్ స్టార్ గా ఉన్న అమితాబ్‌ బచ్చన్ వయసు ఎంత మీద పడుతున్నా గాని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదురులేని హీరోగా వయసుతో సంబంధం లేకుండా హుషారుగా సినిమాలు చేస్తున్నారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఒక పక్క ఫ్యామిలీ లైఫ్ అనుభవిస్తూ మరోపక్క సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి హుషారుగా పాల్గొని అమితాబచ్చన్ వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఇదిలా ఉంటే బిగ్‌బి అమితాబ్, జ‌యా బ‌చ్చ‌న్ స‌రిగ్గా 48 ఏళ్ల క్రితం ఇదే రోజు (జూన్ 3, 1973) వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు.

ఈ నేపథ్యంలో ఇటీవల పెళ్లి రోజు సందర్భంగా అమితాబ్ బచ్చన్ తన పెళ్లి జరిగిన సందర్బాన్ని వెళ్లడించి అందరిని ఆశ్చర్య పర్చాడు. .'జంజీర్' చిత్రం సూపర్ హిట్ అయితే స్నేహితులందరిని ఫారిన్ టూర్ కు తీసుకు వెళ్తానంటూ హామీ ఇచ్చాడట. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇచ్చిన మాట ప్రకారం స్నేహితులందరిని కూడా ఫారిన్ ట్రిప్ కు తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ స్నేహితుల్లో జయా బచ్చన్ కూడా ఉంది. అయితే అమితాబచ్చన్ తండ్రి హరివంశరాయ్ ఒప్పుకోలేదు. పెళ్లి కాకుండా జయాను ఫారిన్ టూర్ కు తీసుకు వెళ్లడానికి వీల్లేదని చెప్పాడట. దాంతో అప్పటికే ప్రేమలో ఉన్న అమితాబచ్చన్ మరియు జయాబచ్చన్ లు వివాహం చేసుకున్నట్లు అమితాబ్ అందరికి షాక్ ఇచ్చారు.

అంతే కాదు ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అమితాబ్ ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు. 48 ఏళ్ల క్రితం జ‌రిగిన పెళ్లినాడు తీసిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోతోపాటు.. మాకు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు అంటూ క్యాప్ష‌న్ జోడించారు. ఇక అమితాబ్ చేసిన ఈ పోస్టుకు ఆయ‌న అభిమానులు చేసిన కామెంట్లు వెల్లువెత్తాయి.


Kranthi

Kranthi

Next Story