అమితాబ్‌ బచ్చన్‌కు గాయాలు.. హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ కె షూటింగ్‌ చేస్తుండగా ప్రమాదం..!

Amitabh Bachchan: బాలీవుడ్‌ స్టార్ హీరో అమితాబ్‌ బచ్చన్‌కు గాయాలయ్యాయి.

Arun Chilukuri
Published on: 6 March 2023 10:57 AM IST
Amitabh Bachchan Injured in Project K Shooting
X

అమితాబ్‌ బచ్చన్‌కు గాయాలు.. హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ కె షూటింగ్‌ చేస్తుండగా ప్రమాదం..!

Amitabh Bachchan: బాలీవుడ్‌ స్టార్ హీరో అమితాబ్‌ బచ్చన్‌కు గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ కె షూటింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఓ యాక్షన్ సీన్‌ చిత్రీకరిస్తున్న సమయంలో అమితాబ్‌ గాయపడ్డారు. ఆయన పక్కటెముకలకు గాయమవగా.. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స అందించారు.

ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స అనంతరం అమితాబ్‌ ముంబై చేరుకున్నారు. తన పక్కటెముకల్లో గాయమైందని తన బ్లాగ్‌లో రాసిన అమితాబ్.. ప్రస్తుతం ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గాయం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని అంతవరకు షూటింగ్‌‌ జరగదని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story