Amitabh Bachchan Gets Job Offer : అమితాబ్ బచ్చన్ కే జాబ్ ఆఫర్ చేశాడు

Amitabh Bachchan Gets Job Offer : అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ స్టార్ హీరో.. ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు..

Krishna
Published on: 11 Aug 2020 11:33 AM IST
Amitabh Bachchan Gets Job Offer : అమితాబ్ బచ్చన్ కే జాబ్ ఆఫర్ చేశాడు
X
Amitabh Bachchan (File Photo)

Amitabh Bachchan Gets Job Offer : అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ స్టార్ హీరో.. ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.. 65 ఏళ్ల వయసులో కూడా ఇంకా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.. అయితే అలాంటి అమితాబ్ కి ఓ అభిమాని జాబ్ ఆఫర్ ఇచ్చాడు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు...

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వయసు మీద పడిన వారు షూటింగ్‌ల్లో పాల్గొనడానికి అనుమతిని నిరాకరించింది మహారాష్ట్ర ప్రభుత్వం.. అయితే దీనిపైన అమితాబ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో అమితాబ్ కి తన అభిమాని ఒకరు జాబ్ ఆఫర్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వివరాలను బిగ్ బీ తన బ్లాగులో పోస్టు చేశారు. 'ఎప్పుడూ ఊహించనిదాన్ని కోరుకోండి. అతడి సృజన ఆకట్టుకుంది' అని రాసుకొచ్చారు. అలాగే తన ఉద్యోగానికి బీమా కూడా ఉందని చివరగా కామెంట్ చేశారు అమితాబ్ బచ్చన్..

కరొనా నుంచి కోలుకున్న అమితాబ్..

తాజాగా బిగ్ బీ కుటుంబం కోరోనా బారిన పడిన సంగతి తెలిసిందే... బిగ్ బీ తో పాటుగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక వీరంతా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇందులో ఐశ్వర్యరాయ్, ఆరాధ్య త్వరగానే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రెండు వారాల క్రితం అమితాబ్ బచ్చన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, తాజాగా అభిషేక్ బచ్చన్ కూడా కరోనాని జయించారు.

Krishna

Krishna

Next Story