"భీమ్లా నాయక్" కు కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్

Bheemla Nayak - Amazon Prime: "భీమ్లా నాయక్" వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

admin1
Published on: 22 Oct 2021 3:57 PM IST
Amazon Prime Big Offer to Bheemla Nayak Movie | Pawan Kalyan | Rana Daggubati
X

"భీమ్లా నాయక్" కు కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్

Bheemla Nayak - Amazon Prime: రీమేక్ సినిమా అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటిదాకా సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ లు మరియు పాటలు సినిమా పై అంచనాలు మరింత పెంచాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో కనిపించనుండగా, రానా డానియల్ శేఖర్ గా కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు చిత్ర నిర్మాతలకు అదిరిపోయే ఆఫర్ను ఇచ్చినట్లు సమాచారం.

"భీమ్లా నాయక్" సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే అమెజాన్ మాత్రం డైరెక్ట్ గా తమ ఓటీటీ లో విడుదల చేయాల్సిందిగా పెద్ద ఆఫర్ని చిత్ర బృందం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. డైరెక్ట్ గా ప్రైమ్ లో విడుదల చేసేటట్లయితే వారు నిర్మాతలకి 150 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ నటించిన "వకీల్ సాబ్" సినిమా కి వచ్చిన ఆఫర్ 50 కోట్లు కానీ ఈ సినిమాకి భారీ ఆఫర్ రావడంతో నిర్మాతలు కూడా ఆలోచనలో పడ్డారు. మరి నిర్మాతలు డైరెక్ట్ గా ప్రైమ్ లో విడుదల చేస్తారా లేక కేవలం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను మాత్రమే ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story