logo
సినిమా

600 కోట్లు దానమిచ్చిన టాలీవుడ్ నటుడు!

600 కోట్లు దానమిచ్చిన టాలీవుడ్ నటుడు!
X
Highlights

ఈ కాలంలో అప్పుడప్పుడు డబ్బు రూపంలో ప్రజలకు సహాయం చేసే వాళ్లు ఉంటారేమో కానీ భూములను సైతం దానం ఇచ్చే గొప్ప మనసు...

ఈ కాలంలో అప్పుడప్పుడు డబ్బు రూపంలో ప్రజలకు సహాయం చేసే వాళ్లు ఉంటారేమో కానీ భూములను సైతం దానం ఇచ్చే గొప్ప మనసు ఉన్న వాళ్లు అసలు ఉండరేమో. కానీ పాత కాలంలో అలాంటి వారు ఉన్నారు. టాలీవుడ్ లో ఒక పేరున్న విలన్ గజాల్లో కాదు ఏకంగా పది ఎకరాల భూమిని టాలీవుడ్ కి దానమిచ్చారు. అప్పట్లో దాని ఖరీదు లక్షలు లక్షల్లో ఉండేది కానీ ఇప్పుడు దాని విలువ ఏకంగా ఆరు వందల కోట్లు. హార్ట్ ఆఫ్ ది సిటీ అయిన గచ్చిబౌలి కి కొంచెం దూరంలో ఉంది ఆ స్థలం.

ఈ దానం ఇచ్చిన గొప్ప కళాకారుడు మరియు గొప్ప మనసున్న వ్యక్తి డా. ప్రభాకర్ రెడ్డి. ఆయ‌న విల‌న్ గా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో రాణించారు. అవకాశం అడిగిన ఎందరో నటులకు సహాయం చేసిన ఆయన కార్మికుల ఆవాసం కోసం చిత్రపురి కాల‌నీకి 10 ఎక‌రాల దానం ఇచ్చారు. హైవే కి అర కిలోమీట‌రు దూరంలో ఉన్న ఈ భూమి దగ్గర ఇప్పుడు ఏకంగా 30 వేల కోట్ల విలువైన భారీ మాల్స్, మ‌ల్టీప్లెక్సులు నిర్మిత‌మ‌వుతున్నాయి. ఎక‌రం రూ.60 కోట్ల చొప్పున పలుకుతోంది. ఒక‌ప్పుడు కొండ‌లు, బండ రాళ్లతో నిండిఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు సిటీలోనే కాస్ట్ లీ హ‌బ్ గా మారింది.


Next Story