సోనూసూద్ కి అరుదైన గౌరవం!

సోనూసూద్ కి అరుదైన గౌరవం!
x

Sonu Sood

Highlights

Real Hero Sonu Sood : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకి పర్మిషన్ లు ఇవ్వడంతో మళ్ళీ టాలీవుడ్ లో షూటింగ్ ల సందడి మొదలైంది.. అందులో భాగంగానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది..

Real Hero Sonu Sood : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకి పర్మిషన్ లు ఇవ్వడంతో మళ్ళీ టాలీవుడ్ లో షూటింగ్ ల సందడి మొదలైంది.. అందులో భాగంగానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది.. ఈ సినిమా షూటింగ్ లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ రోజు పాల్గొన్నారు. సెట్లోకి సోనూ ఎంటర్ అవ్వగానే చిత్ర యూనిట్ మొత్తం సోనూకి చప్పట్లతో స్వాగతం పలికారు.. అనంతరం నటుడు ప్రకాష్ రాజ్ సోనూసూద్ కి శాలువు కప్పి సత్కరించారు. అనంతరం ఓ జ్ఞాపికను కూడా బహూకరించి అభినందిచారు. దీనితో సెట్లో మొత్తం సందడి మొదలైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సాయి శ్రీనివాస్ ఏకంగా 8 ప్యాక్స్‌ లుక్ తో మెప్పించానున్నాడు.. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . డూడ్లే ఈ సినిమాకు సినిమాటోగ్రఫిని అందిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఇక సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే తన సినిమాల్లో ఎక్కువగా విలన్ గా కనిపించే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా నిలుస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. సమస్య కనిపిస్తే చాలు సొల్యూషన్ లాగా కనిపిస్తున్నాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories