Allu Sirish: ముంబైలో అల్లు శిరీష్ ఏం చేశారో తెలుసా?

Allu Sirish: ముంబైలో అల్లు శిరీష్ ఏం చేశారో తెలుసా?

Rama Rao
Published on: 19 Oct 2022 8:29 PM IST
Allu Sirish is Focusing on Business | Tollywood News
X

Allu Sirish: ముంబైలో అల్లు శిరీష్ ఏం చేశారో తెలుసా?

Allu Sirish: అల్లు అరవింద్ రెండవ కుమారుడిగా అల్లు శిరీష్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు. కానీ ఇప్పటికీ తన కరియర్ లో ఒక మంచి బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే ఒక సంవత్సరం పాటు సినిమాలకి దూరంగా ఉన్న అల్లు శిరీష్ తాజాగా ఇప్పుడు "ఊర్వశివో రాక్షసివో" అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అను ఇమ్మాన్యువల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్ కంటే ముందు కొంతకాలం పాటు ముంబైలో సినిమాలకు దూరంగా ఉన్నారు శిరీష్. ఆ సమయంలో ఏం చేశారు అని అడగగా ఒకరిద్దరు స్నేహితులతో కలిసి ఒక స్టార్టప్ మీద వర్క్ చేశానని చెప్పుకొచ్చారు శిరీష్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కి సంబంధించి ఒక కొత్త యాప్ క్రియేట్ చేస్తున్నట్లుగా దానికి సంబంధించిన బిజినెస్ మీద వర్క్ చేసినట్లుగా చెప్పారు శిరీష్.

అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే తన బిజినెస్ గురించి ప్రకటిస్తానని అన్నారు అల్లు శిరీష్. మరోవైపు "ఊర్వశివో రాక్షసివో" సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా తరువాత మళ్ళీ అల్లు శిరీష్ ఎటువంటి సినిమా సైన్ చేయలేదు. అయితే కొంతమంది యువ దర్శకులు ఇప్పుడు అల్లు శిరీష్ కు కొన్ని కథలను వినిపిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అల్లు శిరీష్ తన బిజినెస్ మీద ఫోకస్ చేస్తారా లేక సినిమాలు కొనసాగిస్తారా అని వేచి చూడాల్సి ఉంది.

Rama Rao

Rama Rao

Next Story