బన్నీ-త్రివిక్రమ్ సినిమా అప్పుడే లాంచ్ చేయనున్నారు

గతేడాది బన్నీ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా అనుకున్నంత బాగా ఆడలేదు.
గతేడాది బన్నీ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా అనుకున్నంత బాగా ఆడలేదు. ఇక ఆ తర్వాత ఎలా ఎలాగైనా ఈసారి హిట్ కొట్టి తీరాల్సిందే అన్న కసితో అల్లు అర్జున్ మంచి కథ కోసం చాలా కాలం ఎదురు చూశాడు. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత 'అరవింద సమేత' సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా ఫైనలైజ్ చేశాడు. ఇక ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
ఇప్పటివరకు బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. అవే 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి'. రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి ముచ్చటగా మూడవ సినిమా కూడా కచ్చితంగా హిట్ అయి తీరుతుంది అని, బన్నీ మళ్లీ ఈ సినిమా ద్వారా ఫార్మ్ లోకి వస్తాడు అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు బన్నీ అభిమానులు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ను ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల రోజు సందర్భంగా లాంచ్ చేయనున్నారు. అప్పుడే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది. ఇక త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMT