చక్కని ప్రేమ కథలో స్టయిలిష్ స్టార్

చక్కని ప్రేమ కథలో స్టయిలిష్ స్టార్
x
Highlights

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో డిజాస్టర్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చాలా కాలం తర్వాత ఎట్టకేలకు ఒక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో డిజాస్టర్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చాలా కాలం తర్వాత ఎట్టకేలకు ఒక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా ఒక ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కనుందని తెలుస్తోంది.

బన్నీ ఒక ఫుల్ లెన్త్ ప్రేమ కథ లో నటించి చాలా కాలమైంది కాబట్టి ఈ సినిమా ఫాన్స్ కు ఖచ్చితంగా నచ్చుతుంది అని చిత్రబృందం విశ్వసిస్తోంది. ఇక ప్రతి సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా బన్నీ ఒక్క సరి కొత్త లుక్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటికే బన్నీ త్రివిక్రమ్ కాంబోలో విడుదలైన 'జులాయి' మరియు 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories