పాలకొల్లులో పండుగ జరుపుకోనున్న బన్నీ

Allu Arjun
x
Allu Arjun
Highlights

మామూలుగా సంక్రాంతి పండుగంటే అత్తింట్లో జరుపుకుంటారు అల్లుళ్ళు. కానీ అల్లు అర్జున్ మాత్రం వాళ్ళ తాత గారి సొంత ఊరి లో చేసుకోబోతున్నాడు. అల్లు రామలింగయ్య గారి సొంత ఊరు పాలకొల్లు. మెగాస్టార్ చిరంజీవి ది కూడా ఆ పక్కనే మొగల్తూరు.

మామూలుగా సంక్రాంతి పండుగంటే అత్తింట్లో జరుపుకుంటారు అల్లుళ్ళు. కానీ అల్లు అర్జున్ మాత్రం వాళ్ళ తాత గారి సొంత ఊరి లో చేసుకోబోతున్నాడు. అల్లు రామలింగయ్య గారి సొంత ఊరు పాలకొల్లు. మెగాస్టార్ చిరంజీవి ది కూడా ఆ పక్కనే మొగల్తూరు. అల్లు అర్జున్ మేనమామలు, బాబాయిలు అందరూ కూడా చాలావరకు పాలకొల్లు లోనే స్థిరపడ్డారు. సంక్రాంతి ఇప్పుడు వారితో జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాడు బన్నీ. సంక్రాంతి అంటేనే పల్లెటూర్లలో ముందుగా గుర్తొచ్చేది కోడిపందాలు. పైగా పాలకొల్లు, భీమవరం లాంటి ప్రాంతాలు కోడిపందాలకు బాగా ఫేమస్.

చుట్టుపక్కల ఊర్ల నుండి చాలామంది కేవలం కోడి పందాల కోసం అక్కడికి తరలి వస్తుంటారు. మరి పనిలో పనిగా బన్నీ కోడి పందాలు కూడా చూసి వస్తాడో లేదో తెలియాల్సి ఉంది. ఇక సినిమాల పరంగా చూస్తే 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తరువాత చాలా కాలం బ్రేక్ తీసుకున్న బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్నాడు. గీత ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రతి సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా కొత్త లుక్ తో కనిపించనున్నాడు బన్నీ.

Show Full Article
Print Article
Next Story
More Stories