Allu Arjun: "బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ" అంటున్న బన్నీ

Allu Arjun: ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్" బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది...

admin1
Updated on: 5 Jan 2022 11:15 AM IST
Allu Arjun Said That He is Ready to Act in Bollywood | Telugu Cinema News
X

Allu Arjun: "బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ" అంటున్న బన్నీ

Allu Arjun: ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్" బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు తెలుగులో మాత్రమే కాక హిందీలో కూడా అంతే జోరుతో ముందుకు దూసుకుపోతోంది పుష్ప. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా హీరోగా అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ ఆఫర్లకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు బన్ని. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి బోలెడు ఆఫర్లు కూడా వచ్చాయట కానీ అందులో ఏ ఒక్కటి నచ్చలేదు. అయితే బన్నీ ఇంకా స్క్రిప్టులు వింటూనే ఉన్నారట. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ వేరే భాష సినిమాలో నటించడానికి చాలా ధైర్యం ఉండాలి అని అన్నారు.

అయితే బాలీవుడ్ లో అయినా సరే తాను కేవలం హీరో మాత్రమే చేస్తానని చెబుతున్నారు బన్నీ. రెండవ హీరో పాత్రలు చేసే ఆసక్తి లేదని, కేవలం హీరోగా మాత్రమే సినిమాలు చేయాలని ఉంది చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు తెలుగులో మాత్రమే కాక పుష్ప సినిమా బాలీవుడ్లో కూడా మంచి విజయాన్ని సాధించింది.

admin1

admin1

Next Story