విజయ్ దేవరకొండ హీరోయిన్ బన్నీ తో రొమాన్స్ చేయనుందా?

Allu Arjun
x
Allu Arjun
Highlights

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో డిజాస్టర్ అందుకున్న స్టైలిష్స్టార్ అల్లుఅర్జున్ చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు.

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో డిజాస్టర్ అందుకున్న స్టైలిష్స్టార్ అల్లుఅర్జున్ చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఒక మంచి కోసం వెతికిన బన్నీ చివరికి 'అరవింద సమేత' తో హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇది బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూడవ సినిమా. ఇదివరకు ఈ కాంబో లో విడుదలైన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఇక ఈ సినిమాలో బన్నీ తో రొమాన్స్ చేయబోయే హీరోయిన్ ఎవరు అనే విషయం పై చాలా కాలం నుండి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో బన్నీ సరసన నటించనుంది అని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దర్శక నిర్మాతలు ప్రస్తుతం 'గీతగోవిందం' రష్మిక మందన్న ను హీరోయిన్ గా తీసుకుందామని అనుకుంటున్నారు. వరుస హిట్ సినిమాలతో హ్యాపెనింగ్ బ్యూటీ గా మారింది రష్మిక మందన్న. 'గీత గోవిందం' సినిమాతో గీత ఆర్ట్స్ బ్యానర్ కి బ్లాక్ బస్టర్ ను అందించింది కాబట్టి ఈ సినిమా లో ఈమెనే రిపీట్ చేయాలని అభిప్రాయపడుతున్నారు నిర్మాతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories