Pushpa Movie: రికార్డుల విషయంలో "తగ్గేదే లే" అంటున్న పుష్ప

Pushpa Movie: "పుష్ప: ది రైజ్" లో రికార్డులు సృష్టిస్తున్న అల్లు అర్జున్

admin1
Updated on: 27 Dec 2021 9:45 PM IST
Allu Arjun Pushpa Movie Record Collection | Telugu Movie News
X

 రికార్డుల విషయంలో "తగ్గేదే లే" అంటున్న పుష్ప

Pushpa Movie: భారీ అంచనాల మధ్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన "పుష్ప: ది రైజ్" సినిమా ఈ మధ్యన డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మొదటి రోజు నుంచే యావరేజ్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనసూయ, సునీల్, అజయ్ ఘోష్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తన కెరియర్ లో మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదలైన "పుష్ప" తో అల్లు అర్జున్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు.

భారీ అంచనాల మధ్య కేరళలో కూడా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ప్యాన్ ఇండియన్ సినిమాలలో భారీ కలెక్షన్లు నమోదుచేసుకున్న సినిమాగా పేరుతెచ్చుకుంది. హిందీలో కూడా "పుష్ప" కలెక్షన్లు భారీగానే ఉన్నాయి. 83, స్పైడర్మాన్ వంటి సినిమాలు కూడా ఉన్నప్పటికీ పుష్ప నార్త్ లో కూడా మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. సుకుమార్ మాస్ నరేషన్ మరియు అల్లు అర్జున్ అద్భుతమైన నటన ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ లుగా మారాయి. ఇక ఈ సినిమాతో ప్యాన్ ఇండియన్ రేంజ్ లో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆ ఎఫెక్టు బన్నీ తదుపరి సినిమాలపై కూడా ఉండబోతోంది అనడంలో అతిశయోక్తి లేదు.

admin1

admin1

Next Story