కిల్బిల్ పాండే ను కలిసిన బన్నీ

Ruthvik
Published on: 7 Feb 2019 5:17 PM IST
కిల్బిల్ పాండే ను కలిసిన బన్నీ
X

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్, 'హాస్య బ్రహ్మ' అయిన బ్రహ్మానందానికి ఈ నెల ముంబై లోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. సర్జరీ తర్వాత బ్రహ్మానందం ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అభిమానులు అందరూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రహ్మానందం ను కలిసి పరామర్శించారు. ఆయనతో చాలాసేపు మాట్లాడారు కూడా.

వారిద్దరూ దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ "నిజమైన ఐరన్ మ్యాన్. మనో స్థైర్యం ఉన్న వ్యక్తి. సరదాగా ఉంటారు, అసలు భయమే లేదు. మా కిల్ బిల్ పాండే గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది." అని ట్వీట్ చేశాడు. ఇక సినిమాల పరంగా బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. గీత ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక బ్రహ్మానందం గారు త్వరగా కోలుకుని మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుందాం.



Ruthvik

Ruthvik

Next Story