బన్నీని మరింత స్టైలిష్ గా చూపించనున్న త్రివిక్రమ్

బన్నీని మరింత స్టైలిష్ గా చూపించనున్న త్రివిక్రమ్
x
Highlights

ఎప్పుడో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు తన తదుపరి ప్రాజెక్టును త్రివిక్రమ్...

ఎప్పుడో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు తన తదుపరి ప్రాజెక్టును త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి రెండవ వారం నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. దర్శక నిర్మాతలు ఈ సినిమాలో హీరోయిన్ ని ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ప్రతి సినిమా కి అల్లు అర్జున్ సరికొత్త లుక్ తో కనిపిస్తాడని తెలిసిన విషయమే. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో బన్నీ ని మరింత స్టైలిష్ గా చూపించనున్నారట. దానికోసం త్రివిక్రమ్ సూచన మేరకు బరువు కూడా తగ్గనున్నాడట బన్నీ. అలాగే సరికొత్త హెయిర్ స్టైల్ ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే బన్నీ త్రివిక్రమ్ కాంబోలో విడుదలైన 'జూలాయి' మరియు 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories