ప్రియ వారియర్ కోసం తెలుగు స్టార్ హీరో

Ruthvik
Updated on: 21 Jan 2019 12:00 PM IST
ప్రియ వారియర్ కోసం తెలుగు స్టార్ హీరో
X

కెవలం కన్నుగీట్టి యావత్ భారత దేశంలో ఓవర్నైట్ స్టార్ గా మారిపోయింది ప్రియ ప్రకాష్ వారియర్. ఆమె నటించిన మొదటి మలయాళం సినిమా అయిన 'ఓరు అడార్ లవ్' అనే సినిమాలో ఒక పాట లో ఆమె కన్నుకొట్టే సీన్ సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా 'లవర్స్ డే' అనే టైటిల్ తో తెలుగులో కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ఈ నెల 23 న హైదరాబాద్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కి తెలుగు స్టార్ హీరో ముఖ్య అతిధిగా వెళ్లనున్నారు.

అతను ఎవరో కాదు మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. హైదరాబాద్ లో జరగనున్న 'లవర్స్ డే' ఆడియో ఫంక్షన్ కు బన్నీ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఒమర్ లులు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో సిహెచ్ వినోద్ రెడ్డి మరియు ఏ గురురాజ్ విడుదల చేయనున్నారు. టైటిల్ కు తగ్గట్టు గానే ఈ సినిమా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున విడుదల కానుంది. కేవలం ఒక్క పాటతోనే ప్రేక్షకులను మైమరపించిన ప్రియా వారియర్ ఈ సినిమాతో హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Ruthvik

Ruthvik

Next Story