బన్నీ కోసం అలాంటి కథ రెడి చేసిన త్రివిక్రమ్

బన్నీ కోసం అలాంటి కథ రెడి చేసిన త్రివిక్రమ్
x
Highlights

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తరువాత ఇన్నాళ్లకు బన్నీ తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకున్నాడు. 'జులాయి',...

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తరువాత ఇన్నాళ్లకు బన్నీ తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకున్నాడు. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాల తరువాత బన్నీ,త్రివిక్రమ్ కాంబో లో వస్తున్న మూడవ సినిమా ఇది. ప్రతి సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా బన్నీ సరికొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఇంతకుముందు ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమాలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సినిమా తీసిన త్రివిక్రమ్ ఈ సారి బన్నీ కోసం ఎలాంటి కథ తీసుకురానున్నాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా త్రివిక్రమ్ 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలో లాగా బన్నీ కోసం బోలెడు కామెడీ పంచులు సిద్ధం చేస్తున్నారట త్రివిక్రమ్. ఇక ఫుల్ లెంగ్త్ కామెడీ తో సినిమా అంతా ఆహ్లాదంగా సాగిపోతుంది అని సమాచారం. మార్చ్ ఆఖరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం లో ఈ సినిమా షూటింగ్ మొదవలవనుంది. పూజ హెగ్డే ని ఈ సినిమా లో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది. గీత ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories