100 పర్సెంట్ లవ్ కాంబో మళ్లీ రిపీట్ అవ్వనుందా

100 పర్సెంట్ లవ్ కాంబో మళ్లీ రిపీట్ అవ్వనుందా
x
Highlights

గత కొంతకాలంగా వరుస ఫ్లాఫ్ సినిమాలతో యువ హీరో అక్కినేని నాగచైతన్య మార్కెట్ బాగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది పక్కన పెడితే తన మొట్టమొదటి...

గత కొంతకాలంగా వరుస ఫ్లాఫ్ సినిమాలతో యువ హీరో అక్కినేని నాగచైతన్య మార్కెట్ బాగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది పక్కన పెడితే తన మొట్టమొదటి బ్లాక్బస్టర్ను 100% లవ్ సినిమాతో అందుకున్నాడు చై. 2010 లో తమన్నా హీరోయిన్ గా అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు నాగచైతన్య అల్లు అరవింద్ తో చేయి కలపనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మెగా ప్రొడ్యూసర్ అక్కినేని హీరో సినిమాకు నిర్మాతగా మారనున్నారు.

ఈ మధ్యనే 'గీతగోవిందం' సినిమాతో మర్చిపోలేని సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే నాగచైతన్య తో ఈ సినిమా గురించి డిస్కషన్ చేశారట. ఈ సినిమా గురించి నాగ చైతన్య ఇంకా తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ సినిమా గురించి పక్కన పెడితే అక్కినేని యువ హీరో అఖిల్ కూడా గీతా ఆర్ట్స్ పతాకంపై ఓ సినిమా చేయనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కనున్న ఒక చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories