Bangaru Bullodu Trailer: అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు' థ్రిల్లింగ్ కామెడీ

అల్లరి నరేష్‌ హీరోగా గిరి పల్లిక దర్శకత్వం రూపొందిన తాజా చిత్రం ‘బంగారు బుల్లోడు’.

Samba Siva Rao
Published on: 19 Jan 2021 6:32 PM IST
Bangaru Bullodu Trailer: అల్లరి నరేశ్ బంగారు బుల్లోడు థ్రిల్లింగ్ కామెడీ
X

BangaruBullodu

అల్లరి నరేష్‌ హీరోగా గిరి పల్లిక దర్శకత్వం రూపొందిన తాజా చిత్రం 'బంగారు బుల్లోడు'. ఈ 'బంగారు బుల్లోడు' సినిమా ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. కాగా.. గత కొన్నేళ్లుగా..అల్లరి నరేష్ కాస్త వెనకబడ్డాడు. నరేశ్ సినిమాల్లో కామెడీ మాత్రం బోలెడంత కావాలి.. కానీ పెద్ద హీరోలే బోలెండత హాస్యం పడించడంతో నరేశ్ వెనపబడ్డాడనే చెప్పాలి. ఈ సారి మాత్రం నరేశ్ 'బంగారు బుల్లోడు'తో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమాలోని సాంగ్స్, టీజర్స్ అదరగొడుతున్నాయి. ఈ మూవీలో రిమీక్స్ చేసిన స్వాతిలో ముత్యమంత సాంగ్ ఓరేజ్ లో దూసుకుపోతుంది.

ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. గోదావరి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌కు తోడు, పల్లెటూరి హాస్యంతో సినిమా తెరకెక్కించినట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమౌతోంది. అల్లరి నరేష్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా, కస్టమర్లు కుదవ పెట్టిన బంగారాన్ని తన అవసరాలకు వాడుకుంటూ ఉండటం ట్రైలర్‌లో చూపించారు. పృథ్వీరాజ్‌, ప్రవీణ్, వెన్నెల కిషోర్‌ల కామెడీ సినిమాకు అదనపు ఆకర్షణ నిలవనుంది. జనవరి 23న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రాంబ్రహ్మం సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు. పూజా జవేరీ హీరోయిన్‌గా నటిస్తోంది. పృథ్వీరాజ్‌, ప్రవీణ్, వెన్నెల కిషోర్‌ తరితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ సాయి కార్తీక్ అందిస్తున్నారు.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story