Amitabh Bachchan: కరోనా టీకా వేయించుకున్న అమితాబ్

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ కరోనా టీకా తీసుకున్నట్లు స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Kranthi
Updated on: 2 April 2021 12:23 PM IST
Amitabh Bachchan and his Family get the First Dose of Corona Vaccine
X
Amitabh Bachchan:(ఫైల్ ఇమేజ్)

Amitabh Bachchan: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో కరోనా సోకిన బాధితుల సంఖ్య కూడా పెరుగుతూ వుంది. కరోనా కు విరుగుడు కరోనా టీకాయేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు వేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. బాలీవుడ్ లో ఇప్పటికే సల్మాన్ ఖాన్ తీసుకోగా.. తాజాగా ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ కరోనా టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అమితాబ్ గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ.. గురువారం మధ్యాహ్నం తన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఉన్నట్లుల పేర్కొన్నాడు. ఆ మధ్య అమితాబ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఒక్క అభిషేక్ తప్పా ఇంట్లో అందరూ కరోనా టీకా తీసుకున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ ప్రస్తుతం షూటింగ్ లోకేషన్‌లో ఉండడంతో ఆయన టీకా తీసుకోలేకపోయాడు.

ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. వికాస్ బల్ సినిమాలో ఆయన నటించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇక ఆయన నటించిన గులాబో సీతాబో కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమా అమెజాన్‌లో డిజిటల్ ప్రీమియర్‌గా స్ట్రీమ్ అయ్యి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాను సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించాడు. ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం అజయ్ దేవగన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Kranthi

Kranthi

Next Story