Alia Bhatt: ఆర్ ఆర్ ఆర్ కోసం తప్పుకున్న ఆలియా భట్

Alia Bhatt: ఆర్ ఆర్ ఆర్ కోసం వెనక్కి తగ్గిన ఆలియాభట్

admin1
Published on: 15 Nov 2021 9:10 PM IST
Alia Bhatt starrer Gangubai Kathiyawadi Release Date Postponed
X
ఆర్ఆర్ఆర్ కోసం వెన్నకి తగ్గిన అలియా భట్ (ఫైల్ ఇమేజ్)

Alia Bhatt: అలియా భట్ హీరోయిన్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా గంగుభాయి కథియావాడి. గంగా అనే ఒక సామాన్యురాలు కామాటిపుర రెడ్ లైట్ ఏరియా లో ఒక పవర్ ఫుల్ బ్రోకర్ గా ఎలా మారింది అనేది ఈ సినిమా కథ. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ తోనే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. తన నటనతో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది ఆలియాభట్. తెలుగులో కూడా అదే టైటిల్ తో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

అయితే ఇంతకు ముందు ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 6న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆలియా రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా జనవరి 7 న విడుదల కాబోతుంది. ఆ సినిమా కోసం సంక్రాంతి బరిలో నుండి తప్పుకుంది ఆలియా. తాజాగా గంగుభాయి సినిమా ఫిబ్రవరి 18 2022న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. భన్సాలీ ప్రొడక్షన్స్ నిర్మించిన గంగుబాయి సినిమా కి సంజిత్ బల్హారా మరియు అంకిత బల్హారా సంగీతాన్ని అందించారు.

admin1

admin1

Next Story