Alia Bhatt: తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆలియా భట్

Alia Bhatt: తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆలియా భట్

admin1
Updated on: 14 Feb 2022 9:01 PM IST
Alia Bhatt is Testing her Luck in Tollywood | Telugu Movie News
X

Alia Bhatt: తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆలియా భట్

Alia Bhatt: ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలందరూ ప్యాన్ ఇండియా సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కూడా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కన్నేసింది. బాలీవుడ్ లో చాలా సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. అందులో ఒకటి అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియన్ రేంజిలో ప్లాన్ చేసిన దర్శక నిర్మాతలు హిందీలో మాత్రమే కాక సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.

"ఆర్ఆర్ఆర్" సినిమాలో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఆలియాభట్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో కూడా ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతోంది. "ఆర్ ఆర్ ఆర్" సినిమా ప్రమోషన్స్ లో కూడా చాలాసార్లు తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆలియా ఇప్పుడు తన సినిమాని తెలుగులో విడుదల చేయబోతోంది. తెలుగులో కూడా ఆలియా భట్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ట్రైలర్ కి కూడా మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో "గంగుభాయి" సినిమా తో తెలుగు సౌత్ ఇండియా లో అలియా ఎంత వరకు హిట్ అందుకుంటుంది అని వేచి చూడాలి.

admin1

admin1

Next Story