అలీరేజా ఐదో స్థానంతో బయటకు వచ్చేశాడు!

K V D Varma
Published on: 3 Nov 2019 7:38 PM IST
Alireza
X
Alireza

బిగ్ బాస్ ఫినాలే గ్రాండ్ గా మొదలైంది. బయట వున్న బిగ్ బాస్ పోటీదార్ల ఆట..పాటలతో సందడిగా ఫినాలే ప్రారంభం అయింది. కింగ్ నాగార్జున తనదైన స్టైల్ లో ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌లో 100 రోజుల ప్రయాణాన్ని టాప్ 5 కంటెస్టెంట్లకు చూపించారు. ఇది వాళ్లకు ఇచ్చిన గిఫ్ట్ అని నాగార్జున చెప్పారు. తరువాత హీరోయిన్ కేథరిన్ త్రెసా సూపర్ డ్యాన్స్ తొ తాను

సినిమాల్లో దుమ్మురేపిన పాటలకు బిగ్ బాస్ వేదికపై అదిరిపోయే స్టెప్పులేసి అలరించారు. 'ప్రతిరోజూ పండగే' దర్శకుడు మారుతి, హీరోయిన్ రాశీ ఖన్నా బిగ్ బాస్ వేదికపైకి వచ్చారు. నాగార్జున రాశీ ఖన్నా తొ ఒక పాట పాడించారు.'తెలుసా తెలుసా' అంటూ పాట పాడి అదరగొట్టారు. తరువాత వాళ్ళిద్దర్నీ హౌస్ లోకి ఒక కవర్ తొ పంపించారు. లోపల వారితో బాబా భాస్కర్ సూపర్ డాన్స్ చేయించారు. ఇక కవరు ఓపెన్ చేసిన తరువాత అందులో ఐదో స్థానం లో ఉన్న అలీ రెజా ఎలిమినేట్ అయినట్టు ప్రకటించిన మారుతి, రాశీ ఖన్నా అలీని తీసుకుని బయటకు వచ్చారు.

K V D Varma

K V D Varma

Next Story