జబర్దస్త్ లో ఆలీ! చమ్మక్ చంద్ర మళ్ళీ!!

జబర్దస్త్ లో ఆలీ! చమ్మక్ చంద్ర మళ్ళీ!!
x
Ali, Roja in Extra Jabardasth Promo. insert Chammak Chandra
Highlights

జబర్దస్త్ లో మార్పులూ చేర్పులూ ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు. తాజా ప్రోమోలో జడ్జిగా రోజాతో కల్సి ఆలీ కనిపించరు.. వెళ్లిపోయానన్న చమ్మక్ చంద్ర కూడా మెరుపులు మెరిపించారు!

బుల్లితెర పై మెరుపులు మెరిపించిన కథలెన్నో ఉన్నాయి. సంచలనం సృష్టించిన సీరియల్స్ కి లెక్కేలేదు. కిక్కెక్కించిన గేమ్ షోలకు కొదవే లేదు. కానీ, అన్నిటినీ మించి తెలుగు టెలివిజన్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన కార్యక్రమం ఏదైనా ఉందంటే అది ఈటీవీ 'జబర్దస్త్' మాత్రమే అనడం లో అతిశయోక్తి లేదు. జబర్దస్త్ టీఆర్ఫీ రేటింగ్ ల పరంగా సృష్టించిన సంచలనం ఒక ఎత్తైతే, ఆ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన ఎందరో కళాకారులకు బంగారు భవిష్యత్ ఇచ్చిన ప్లాటుఫామ్ గా నిలబడిన వైనం మరో ఎత్తు. ఇక ప్రేక్షకుల్లో అయితే జబర్దస్త్ కార్యక్రమం అంటే చాలు ఎంతో అభిమానం. ఈ కార్యక్రమం ప్రసారమైన సమయంలో చూసిన వారికంటే.. యూట్యూబు లో వీక్షించిన వారి సంఖ్య కొట్ల లో ఉంటుంది.

జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలు గా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా లకైతే ఇది అద్భుతమైన వేదికగా నిలిచింది. జబర్దస్త్ అంటేనే నాగబాబు అనేంతగా నాగబాబు ఈ షో కి ముఖ్యమైన వారి మారిపోయారు. కానీ, ఏడేళ్ల తన జబర్దస్త్ ప్రయాణాన్ని వదిలేశారు నాగబాబు. వదిలేయడమే కాదు తానెందుకు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చిందీ చెబుతూ వరుసగా వీడియోలూ రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నాగబాబు లేకుండానే జబర్దస్త్ రెండు వారాయలు నడిచింది. రోజా ఒక్కరే సింగిల్ జడ్జి గా కార్యక్రమాన్ని రెండు వారాలు లాగించేశారు. నాగబాబు ను రీప్లేస్ చేసే వారెవరో అనే సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. మొదట ఆలీ అనుకున్నారని వార్తలు వచ్చాయి. అయన చేయట్లేదని చెప్పుకున్నారు. తరువాత బండ్ల గణేష్ పేరు మరికొంత కలం వినిపించింది. అదలా ఉండగానే సీనియర్ నటుడు నరేష్ పేరు కూడా ఇటీవలి కాలంలో చక్కర్లు కొట్టింది.

అయితే, తాజాగా ఎక్స్ట్రాజబర్దస్త్ ప్రోమో లో ఆలీ కనిపించారు. ఈయన పూర్తిగా జబర్దస్త్ షో కి వచ్చినట్టా లేదా అనే అనుమానాలు తీరలేదు కానీ, ఆలీ న్యాయనిర్ణేతగా ఉన్న ప్రోమో మాత్రం సందడి చేస్తోంది. అన్నట్టు ఈ ప్రోమోలో ఇంకో ట్విస్ట్ కూడా కనిపించింది. నాగబాబు తో పాటు జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన చమ్మక్ చంద్ర గత రెండు వారాలు ఎక్స్ట్రాజబర్దస్త్ లో కనిపించలేదు. కానీ, ఈ తాజా ఎపిసోడ్ లో మళ్ళీ తన టీమ్ తో మెరిశాడు. దీంతో చంద్ర మళ్ళీ జబర్దస్త్ కి వచ్చేశాడా.. లేకపోతె పాత రికార్డింగ్ దీనిలో చూపించారా అనేది అందర్నీ పట్టి ఊపేస్తున్న ప్రశ్నగా మారిపోయింది.

మొత్తమ్మీద జబర్దస్త్ లో మార్పులూ చేర్పులూ సస్పెన్స్ థ్రిల్లర్ లా కనిపిస్తున్నాయి. ఈ హడావుడి ని కూడా ప్రచారం చేసుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories