Ala Vaikunthapurramloo: అలా వైకుంఠపురములో.. మొట్టమొదట ఎక్కడ విడుదలవుతుందంటే..

K V D Varma
Updated on: 10 Jan 2020 1:18 PM IST
Ala Vaikunthapurramloo: అలా వైకుంఠపురములో.. మొట్టమొదట ఎక్కడ విడుదలవుతుందంటే..
X

సామజవరగమనా.. అంటూ తొలిపాట విడుదల చేసింది మొదలు.. మ్యూజిక్ కాన్సెర్ట్ అంటూ విడుదల చేసిన ట్రైలర్ వరకూ ఒక రేంజిలో ప్రేక్షకుల ఆసక్తిని పెంచిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సినిమా 'అల వైకుంఠపురములో..' ఈ సినిమా జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

సంక్రాంతి బరిలో మ్యూజికల్ ఫెస్టివల్ లా రూపొందించిన సినిమాగా ప్రచారంలో ఉన్న ఈ సినిమా పాటలు ఇప్పటికే కోట్లాది అభిమానుల్ని సంపాదించేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో ఈసినిమా పాటలకూ లేనంత రెస్పాన్స్ ఈ అల వైకుకుంఠపురములో.. పాటలకు వచ్చింది. సాధారణంగా సినిమాల్లో ఒకటి రెండు పాటలు అందర్నీ ఆకట్టుకుంటాయి. కానీ, ఈ సినిమా పాటలన్నీ లక్షలాది వ్యూలను సాధించి చరిత్ర సృష్టించాయి. ఆడియో పరంగా ఎంత సంచలనం సృష్టించాయో.. అంత కంటే ఎక్కువగా వీడియో పాటలు కూడా జనాల్లోకి దూసుకుపోయాయి.

ఇదిలా ఉంచితే, ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ 12న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా మొదట షో అధికారికంగా ఎక్కడ పడుతుందో తెలుసా? ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలుగా 12వ తేదీ తెల్లవారుజామునుంచే ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో పన్నెండు గంటల ముందుగానే అల వైకుంఠపురములో సందడి మొదలవ బోతోంది. ఇందులో భాగంగా తోలి షో మన కాలమానం ప్రకారం రేపు రాత్రి 7 గంటలకు ప్రదర్శించనున్నారు. అది ఎక్కడంటే.. మలేషియా లోని ఫెడరల్ సినిమాస్ లో! ఇక్కడ ప్రదర్శించే ఈ షో అధికారికంగా మొదటి షో కానుంది. అంటే రేపు రాత్రి 10 గంటలకల్లా ఈ సినిమా ఫస్ట్ టాక్ ప్రపంచానికి తెలిసిపోయే అవకాశం ఉంది.

ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. టబు, నివేతా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరాం, సుశాంత్, వెన్నెల కిషోర్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, హర్షవర్ధన్, సచిన్ ఖేడేకర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో రజినీకాంత్ దర్బార్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు విడుదలవుతున్నాయి.


K V D Varma

K V D Varma

Next Story