Akshay Kumar: ప్ర‌తిరోజూ గో మూత్రం తాగుతా: అక్షయ్

Akshay Kumar: బాలీవుడ్ న‌టుడు అక్షయ్ కుమార్ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న ప్ర‌తిరోజూ గో మూత్రాన్ని సేవిస్తాన‌ని చెప్పి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు.

Karampoori Rajesh
Published on: 10 Sept 2020 9:15 PM IST
Akshay Kumar: ప్ర‌తిరోజూ గో మూత్రం తాగుతా: అక్షయ్
X

Akshay Kumar reveals he drinks cow urine every day

Akshay Kumar: బాలీవుడ్ న‌టుడు అక్షయ్ కుమార్ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న ప్ర‌తిరోజూ గో మూత్రాన్ని సేవిస్తాన‌ని చెప్పి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. ఆయుర్వేద పరంగా ఇది ఎంతో మంచిదన్నారు. ఇటీవ‌ల‌.. అక్షయ్‌ 'ది వైల్డ్‌ విత్‌ బేర్‌ గ్రిల్స్‌' షోలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ప్రామోష‌న్‌లో భాగంగా బేర్ గ్రిల్స్, హుమా ఖురేషిలతో అక్షయ్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ లో పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలోబేర్ గ్రిల్స్,అక్షయ్ లు ఏనుగు మలవిసర్జనతో చేసిన టీని తాగారు. ఈ స‌న్నివేశం పై స్పందించిన హ్యుమా ఖురేషి 'ఆ ప్రత్యేకమైన టీని తాగమని అక్షయ్‌ని ఎలా ఒప్పించారని' బేర్‌ గ్రిల్స్‌ని అడిగింది. అందుకు 'ఆ పని ఎలా జరిగిందో నాకు తెలియదు. కానీ చెడ్డ పని మాత్రం కాదు' అన్నారు బేర్‌ గ్రిల్స్‌.

ఇంటు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ .ఈ ప్రోగాంలో అక్షయ్ కుమార్ డేర్ డెవిల్ స్టంట్స్ ప్రదర్శిస్తారు. చెట్టుకు కట్టిన తాడు నిచ్చెన ఆధారంగా ఒక నీటి ప్రవాహాన్ని దాటుతారు. ఇలాంటి స్టంట్స్ ఎలా చేయగలిగారని హుమా ఖురేషి చాట్ సమయంలో ప్రశ్నించగా.. అక్షయ్ సమాధానమిస్తూ, "నేను ఆందోళన చెందలేదు. ఆయుర్వేద కారణాల వల్ల నేను ప్రతి రోజు ఆవు మూత్రాన్ని తీసుకుంటున్నాను" అని చెప్పేసరికి ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

అక్షయ్ కుమార్‌తో తన అనుభవం గురించి బేర్ మాట్లాడుతూ.. అయన ఎంతో ప్రశాంతంగా ఉంటారని, ఎలాంటి అహం లేదని, వినయంగా ఉండే వ్యక్తి అని అక్షయ్ కుమార్ ను బేర్ గ్రిల్స్ ఆకాశానికెత్తాడు. ఇక 'ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్' షో‌ రేపు (సెప్టెంబర్ 11) రాత్రి 8 గంటలకు డిస్కవరీ ప్లస్ చానల్‌లో.. సెప్టెంబర్ 14 న రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానల్‌లో టెలికాస్ట్‌ అవుతుంది.


Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story