Akshay Kumar - Bear Grylls : అక్షయ్ కుమార్ సాహస యాత్ర!

Akshay Kumar - Bear Grylls : డిస్కవరీ ఛానెల్ చూసే చూసే ప్రతి ఒక్కరికి బేర్ గ్రిల్స్ గురించి తెలిసే ఉంటుంది. అతగాడు చేసే విన్యాసాలు

Krishna
Published on: 22 Aug 2020 1:24 PM IST
Akshay Kumar - Bear Grylls : అక్షయ్ కుమార్ సాహస యాత్ర!
X

Akshay Kumar’s episode of Bear Grylls Into the Wild to premiere on Sept 11

Akshay Kumar - Bear Grylls : డిస్కవరీ ఛానెల్ చూసే చూసే ప్రతి ఒక్కరికి బేర్ గ్రిల్స్ గురించి తెలిసే ఉంటుంది. అతగాడు చేసే విన్యాసాలు అందర్నీ చాలా అబ్బురపరుస్తుంటాయి. అప్పుడప్పుడు ప్రముఖులను కూడా సాహస యాత్రలకు తీసుకు వెళ్తాడు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ మరియు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లతో సాహస యాత్రలను చేసిన ఈయన తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో సాహస యాత్రను చేయించాడు..

దీనికి సంబంధించిన ప్రోమోను నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అక్షయ్ కుమార్.. న‌న్ను పిచ్చోడు అనుకుంటున్నారా.. పిచ్చోళ్ళే అడ‌విలో సాహ‌సాలు చేస్తారు అంటూ కామెంట్‌లో తెలిపాడు. అటు బేర్ గ్రిల్స్ కూడా దీనికి సంబంధించిన వీడియోని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. అక్షయ్ ఉత్తమ సాహ‌స యాత్రికుడు అంటూ కితాబు ఇచ్చాడు.. ఈ కార్యక్రమం డిస్కవరీ ప్లస్ యాప్ లో సెప్టెంబ‌ర్ 11న రాత్రి 8 గంటలకు విడుద‌ల కానుంది. సెప్టెంబ‌ర్ 14న డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం కానుంది.

ఇప్పటి వరకు బేర్ గ్రిల్స్ ఎన్నో సాహసయాత్రలు చేయగా అతనితో సాహసం చేసిన మూడో భార‌తీయుడు అక్షయ్ కుమార్ కావడం విశేషం.. దీనిపట్ల అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. జీవితమంటే ఓ సాహస యాత్ర... అలాంటి సాహసాలను కొంతమంది మాత్రమే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందులో నేను ఒకడిని.. అంటూ చెప్పుకొచ్చారు..


Krishna

Krishna

Next Story