ఎన్టీఆర్ ప్లాప్ సినిమాని అక్షయ్ కుమార్ రీమేక్?

ఎన్టీఆర్ ప్లాప్ సినిమాని అక్షయ్ కుమార్ రీమేక్?
x
Highlights

ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ సినిమాకి చాలా మంది అభిమానులు ఉన్నారు.

టాలీవుడ్ లోని సినిమాలకి ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడుతుంది. లేటెస్ట్ మూవీస్ మాత్రమే కాదు అప్పుడెప్పుడో వచ్చిన సినిమాలను రీమేక్ చేసిన చూస్తున్నారు అక్కడి ప్రేక్షకులు. మన తెలుగులో పదేళ్ళ కింద వచ్చిన వర్షం, ఠాగూర్ లాంటి చిత్రాలు ఈ మధ్య బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చత్రపతి సినిమా అక్కడ రీమేక్ అవుతుంది. ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఇప్పుడు మరో సినిమాని బాలీవుడ్ లోకి రీమేక్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.. అదే ఉసరవెల్లి సినిమా. ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ సినిమాకి చాలా మంది అభిమానులు ఉన్నారు. సరిగ్గా ఈ సినిమా విడుదలైన సమయానికి దూకుడు చిత్రం రావడం ఈ మూవీకి మైనస్ గా మారిందని సినీ విశ్లేషకులు అంటుంటారు.

కంటెంట్ బాగుండడంతో బెంగాలీ నిర్మాతలు ఈ చిత్ర హక్కులను కొనుక్కొని అక్కడ రీమేక్ చేశారు. కానీ అక్కడ కూడా సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఇదే సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ టిప్స్ రెడీ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటివల అక్షయ్ కుమార్ తెలుగులో వచ్చిన కాంచన సినిమాని అక్కడ లక్ష్మీతో రీమెక్ చేసి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories