ఆదరగోట్టిన అక్షయ్.. 'లక్ష్మీబాంబ్' ట్రైలర్ వచ్చేసింది..

Laxmmi Bomb Trailer : రాఘవ లారెన్స్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్మీబాంబ్’.. తెలుగులో వచ్చిన ‘కాంచన’ సినిమాకి ఇది రీమేక్.. కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ రిలీజ్ అయింది.

Krishna
Published on: 9 Oct 2020 3:23 PM IST
ఆదరగోట్టిన అక్షయ్.. లక్ష్మీబాంబ్ ట్రైలర్ వచ్చేసింది..
X

Laxmmi Bomb Trailer : రాఘవ లారెన్స్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'లక్ష్మీబాంబ్'.. తెలుగులో వచ్చిన 'కాంచన' సినిమాకి ఇది రీమేక్.. కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ తన నటనతో అలరించనున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. దెయ్యాలు, భూతాలనేవి లేవు..' అనే డైలాగ్‌తో మొదలైన చిత్ర ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. 'నిజంగా నేను దెయ్యాన్ని చూసిన రోజు.. నా చేతికి గాజులు వేసుకుంటా..' అని అక్షయ్‌ కోపంగా చెప్పడం, అక్షయ్ షాపింగ్‌ మాల్‌లో ఎరుపు రంగు చీర కట్టుకుని మాట్లాడే తీరు మొత్తం ట్రైలర్ కి హైలెట్‌గా నిలిచింది.

ఒరిజినల్ కథలో కొన్ని మార్పులు చేసి.. 'లక్ష్మీబాంబ్‌'ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో అక్షయ్ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్, తుషార్‌ ఎంటర్‌టైన్‌ హౌజ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాని దీపావళి కానుకగా ఓటీటీ ద్వారా నవంబర్ 9న విడుదల చేయనున్నారు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ట్రైలర్ పైన మీరు కూడా ఓ లుకేయ్యండి!



Krishna

Krishna

Next Story