Forbes List Of 2020 : ఇండియా నుంచి ఒకే ఒక్కడు ... అక్షయ్

Forbes List Of 2020 : ప్రపంచంలోనే అత్యధిక సంపన్న నటుల జాబితాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తొలి పదిస్థానలలో చోటు సంపాదించుకున్నాడు

Krishna
Published on: 13 Aug 2020 2:32 PM IST
Forbes List Of 2020 : ఇండియా నుంచి ఒకే ఒక్కడు ... అక్షయ్
X
akshay kumar

Forbes List Of 2020 : ప్రపంచంలోనే అత్యధిక సంపన్న నటుల జాబితాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తొలి పదిస్థానలలో చోటు సంపాదించుకున్నాడు. ఈ జాబితాలో అక్షయ్ కుమార్‌ 48.5 మిలియన్‌ డాలర్ల (ఇండియన్ కరెన్సీ ప్రకారం 363 కోట్ల రూపాయలు) ఆరో స్థానంలో నిలిచాడు. తాజాగా ఫోర్బ్స్‌ మ్యాగజైన్ ఈ జాబితాను విడుదల చేసింది. అయితే ఫోర్బ్స్‌ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ జాబితాలో మరో భారతీయ నటుడు లేకపోవడం విశేషం.. అయితే గత సంవత్సరం ఇదే ఫోర్బ్స్‌ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో అక్షయ్ కుమార్‌ నాలుగో స్థానంలో నిలవగా ఈ సారి ఆరో స్థానంలో నిలిచాడు.

ఇక ఈ జాబితాలో హాలీవుడ్‌ నటుడు డ్వేన్‌ జాన్సన్‌ 87.5 మిలియన్‌ డాలర్లతో మొదటి స్థానంలో చోటు సంపాదించుకున్నాడు.. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గతేడాది కూడా ఆయనది మొదటిస్థానమే కావడం. ఇక ఆ తరవాత డెడ్‌పూల్‌ స్టార్‌ ర్యాన్ రెనాల్డ్ 71.5 మిలియన్ల డాలర్లతో రెండో స్థానంలో ఉండగా, మార్క్‌ వాల్బర్గ్‌, బెన్ అఫ్లెక్‌, విన్‌ డీజిల్‌ మూడు, నాలుగు, ఐదు స్థానాలను ఆక్రమించారు.

ఇక అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వచ్చేసరికి దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్‌' అనే సినిమాని చేస్తున్నాడు.. తెలుగులో సూపర్ హిట్ అయిన కాంచన సినిమాకి ఇది రీమేక్‌.. ఇదే కాకుండా బెల్ బాటమ్, బచ్చన్‌ పాండే, పృథ్వీరాజ్‌ అనే సినిమాలను చేస్తున్నాడు అక్షయ్..

Krishna

Krishna

Next Story