భారతీయుడు 2 లో కూడా కనపడనున్న పక్షిరాజ

మొన్నీమధ్యనే రజనీకాంత్ హీరోగా '2.O' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన శంకర్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా 'రోబో' సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సంగతి తెలిసిందే.

Ruthvik
Published on: 18 Jan 2019 8:19 AM IST
Akshay Kumar
X
Akshay Kumar

మొన్నీమధ్యనే రజనీకాంత్ హీరోగా '2.O' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన శంకర్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా 'రోబో' సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన దృష్టిని 'భారతీయుడు' సీక్వెల్ మీద పెట్టాడు శంకర్. ఈ మధ్యనే విడుదలైన 'భారతీయుడు2' ఫస్ట్ లుక్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలీవుడ్ మీడియా నుండి ఒక ఆసక్తికరమైన వార్త వినపడుతోంది.

'2.O' సినిమాలో విలన్ పాత్రలో నటించిన అక్షయ్ కుమార్ 'భారతీయుడు 2' సినిమా లో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి శంకర్ విలన్ పాత్ర కోసం అజయ్ దేవగన్ ను అనుకున్నాడు కానీ అజయ్ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ పాత్ర కోసం మళ్లీ అక్షయ్ కుమార్ సంప్రదించాడు శంకర్. అన్నీ ఓకే అయితే '2.O' సినిమాలో పక్షిరాజా గా కనిపించిన అక్షయ్ కుమార్ 'భారతీయుడు2' సినిమా లో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Ruthvik

Ruthvik

Next Story