Wild Dog: నాగార్జున 'వైల్డ్ డాగ్' ట్రైలర్ రిలీజ్

Akkineni Nagarjuna Wild Dog Trailer Released
x

వైల్డ్ డాగ్ లో నాగార్జున (ఫొటో ట్విట్టర్)

Highlights

Wild Dog: యువ సామ్రాట్ కింగ్ నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీ ట్రైలర్ శుక్రవారం రిలీజ్ అయింది.

Wild Dog: యువ సామ్రాట్ కింగ్ నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీ ట్రైలర్ శుక్రవారం రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ మేకర్స్ ఇంతకు ముందు క్షణం, ఘాజీ సినిమాలతో ఆకట్టుకున్నారు. అహిషోర్ సాల్మోన్ డైరెక్టర్ గా చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ విజయ్ వర్మ అనే పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ సీన్స్ లో నాగార్జున ఆకట్టుకున్నారు. ఉగ్రవాదులతో పోరాటాలు ఆకట్టుకున్నాయి. నన్ను అరెస్టు చేయండి అని ఓ ఉగ్రవాది అనగా, గన్ తో కాల్చిపారేస్తాడు నాగర్జున. అంటే ఈ సినిమా అంతా ఫుల్ ప్యాక్ డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకోబోతోంది. నాగర్జున తోపాటు సైయమి ఖేర్, ప్రకా‌శ్ సుదర్శన్ తోపాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రాజా కూడా ఈ సినిమాలో నటించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories